త్వ‌ర‌లో సాహో లో “psycho saiyaan” లిరిక్ తో సాగే సాంగ్


Saaho song Psycho Saiyaan first look out
Saaho song Psycho Saiyaan first look out

‘బాహుబలి’ 1, 2 తరువాత ప్ర‌పంచం లో వున్న ప్ర‌తి ఓక్క‌రి చూపు యంగ్ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ వైపు తిరిగింది. ఈ త‌రుణం లో సాహో మేకింగ్ మెద‌ల‌య్యే స‌రికి వారి ఆనందానికి అవ‌ధులు లేవు..సోష‌ల్ మీడియా అయితే వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌భాస్ న‌టింస్తున్న సాహో సినిమా నెక్ట్స్ అప్‌డేట్ ఏమటి అనే సెర్చ్ విప‌రీతంగా జ‌రుగుతుంది. ఈసారి చిత్ర యూనిట్ మ‌రో అప్‌డేట్ ని ఇచ్చారు. ఈ చిత్రానికి సంభందించి మెద‌టి సాంగ్ ఏ లిరిక్ తో స్టార్ట‌వుతుందో చెప్పెసారు.
psycho saiyaan తో స్టార్ట‌య్యే ఈ సాంగ్ అతిత్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని తెలియ‌జేశారు. దీంతో పాటు రిలీజ్ చేసిన రెబల్‌స్టార్ ప్ర‌భాస్ మ‌రియు గ్లామ‌ర్ క్వీన్ శ్రధ్ధాదాస్ ల పోస్ట‌ర్స్ ని సాంగ్ లిరిక్ తో ప్రేక్ష‌కుల్ని విప‌రీతంగా ఆక‌ట్ట‌కున్నాయి,. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఉత్కంఠని మరింత పెంచుతూ మూడు భాషల్లో భారీ బడ్జెట్ తో టాలీవుడ్ ప్రేస్టేజియ‌స్ ప్రోడ‌క్ష‌న్ హౌస్ యువి క్రియెష‌న్స్ బ్యాన‌ర్ లో వంశి, ప్ర‌మెద్, విక్ర‌మ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జిబ్రాన్ అందించిన‌ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్ ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందించనున్నారు జిబ్రాన్. ఇక ఈ సాహో చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా అగ‌స్ట్ 15 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయ‌ర్ గా విడుద‌ల కి సిద్ధ‌మౌతోంది.

యువీ క్రియేషన్స్ అధినేతలు వంశీ-ప్రమోద్ఏ-విక్ర‌మ్ లు ఏ విషయంలోనూ రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

న‌టీన‌టులు.. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్, శ్రధ్ధాక‌పూర్‌, జాకీష‌ర‌ఫ్, నీల్ నితిన్ ముఖేష్‌, అరుణ్ విజ‌య్‌, లాల్‌, వెన్నెల కిషోర్‌, ప్ర‌కాష్ బెల్వాది, ఎవిలిన్ శ‌ర్మ‌, చుంకి పాండే, మందిరా బేడి, మ‌హేష్ మంజ్రేఖ‌ర్‌, టిను ఆనంద్‌, శ‌ర‌త్ లోహిత‌ష్వా త‌దిత‌రులు..

(Prabhas,Shraddha Kapoor,Jackie Shroff,Neil Nitin Mukesh,Arun Vijay,Lal,Vennela Kishore,Murli Sharma,Arun Vijay,Prakash Belavadi,Evelyn Sharma,Chunky Pandey,Mandira Bedi,Mahesh Manjrekar,Tinnu Anand …
Sharath Lohitashwa)