డిజిటల్ వ్యూస్ లో సాహో సరికొత్త చరిత్ర


Saaho teaser trending number one in youtube
Saaho teaser trending number one in youtube

నిన్న సాహో టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే . సాహో టీజర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం కేవలం ఒక గంటలోనే లక్ష వ్యూస్ ని సాధించింది . అలాగే కేవలం 6 గంటల్లోనే 25 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది . యూట్యూబ్ లో నెంబర్ వన్ గా ట్రెండింగ్ లో ఉంది సాహో టీజర్ . అద్భుతమైన విజువల్స్ తో యాక్షన్ సీన్స్ తో అలరిస్తోంది సాహో టీజర్ .

ఇక పలువురు సినీ ప్రముఖులు సాహో మాయలో పడిపోయారు . ప్రభాస్ ని సాహో చిత్ర బృందాన్ని ఆకాశానికి ఎత్తుతోంది టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ . 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 15 న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు . టీజర్ తో కేక పెట్టించిన ప్రభాస్ ట్రైలర్ తో బాక్స్ లు బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది . ఇక సినిమా అయితే ఓపెనింగ్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం .