రికార్డులు బద్దలు కొడుతున్న సాహో ట్రైలర్


Saaho Trailer
Saaho Trailer

ప్రభాస్ హీరోగా నటించిన సాహో ట్రైలర్ నిన్న సాయంత్రం విడుదలైన విషయం తెలిసిందే. సాహో ట్రైలర్ ఇలా విడుదల అయ్యిందో లేదో అలా వ్యూస్ పరంగా చరిత్ర సృష్టిస్తూ శరవేగంగా దూసుకుపోతోంది. ఇప్పటికే 30 ప్లస్ మిలియన్ వ్యూస్ సాధించిన సాహో ట్రైలర్ అసాధారణ స్థితిలో ఉండటంతో వీక్షకులను విశేషంగా అలరిస్తోంది.

సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆగస్టు 30న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రభాస్ పోలీస్ అధికారిగా నటిస్తుండగా శ్రద్దా కపూర్ క్రైమ్ బ్యూరో ఆఫీసర్ గా నటిస్తోంది. ఈ చిత్రంతో ప్రభాస్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇక నిన్న ముంబై లో సాహో ప్రెస్ మీట్ జరుగగా ఈరోజు హైదరాబాద్ లో జరుగనుంది. ట్రైలర్ ఊచకోత కోస్తుండటంతో ప్రభాస్ తో పాటుగా అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.