330 కోట్ల బిజినెస్ తో సాహో సరికొత్త సంచలనం


Saaho Worldwide pre release business
Saaho Worldwide pre release business

330 కోట్ల బిజినెస్ తో సరికొత్త సంచలనం సృష్టిస్తున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . 350 కోట్ల భారీ బడ్జెట్ తో సాహో రూపొందిన విషయం తెలిసిందే . సుజిత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధం కావడంతో బిజినెస్ చర్చ సాగుతోంది . ఇక సాహో కు జరిగిన  బిజినెస్ ని చూస్తుంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం . అంతగా చరిత్ర సృష్టిస్తోంది .

హిందీ హక్కులకు ఏకంగా 120 కోట్లు పలకడం ట్రేడ్ విశేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది . అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో 125 కోట్ల బిజినెస్ జరిగిందట . మొత్తంగా అన్ని వెర్షన్ లు కలుపుకొని 330 కోట్ల బిజినెస్ జరిగింది . ఇక ఈ సినిమా రూపొందింది 350 కోట్లు . మిగతా సొమ్ము శాటిలైట్ రైట్స్ , డిజిటల్ రైట్స్ , ఆడియో రైట్స్ రూపంలో రానున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ రేంజ్ లో ఉంటే ఇక రేపు సినిమా విడుదల అయ్యాక ఏ రేంజ్ లో సంచలనాలు ఉంటాయో అన్న చర్చ సాగుతోంది .