మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న బెల్లంకొండ


saakshyam movie teach a lesson to bellamkonda

అగ్ర నిర్మాతగా ఓ వెలుగు వెలిగాడు బెల్లంకొండ సురేష్ అయితే కొన్ని సినిమాలతో పాటుగా కొన్ని విషయాల వల్ల రేసులో లేకుండాపోయాడు . కట్ చేస్తే కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ని హీరోగా పరిచయం చేశాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కడం వల్ల ఇబ్బంది పడ్డాడు కట్ చేస్తే ఇప్పటికి కూడా మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు బెల్లంకొండ సురేష్. నిర్మాతల పేర్లు మారుతున్నాయి కానీ అసలు పెట్టుబడిదారుడు ఈయనే అని బహిరంగంగా టాక్ నడుస్తోంది. మొదటి సినిమా దర్శకుడు వివివినాయక్ కావడంతో అల్లుడు శీను చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు అయితే పెట్టిన పెట్టుబడి తిరిగి రాలేదు కానీ ఆ సినిమా వల్ల హీరోగా మంచి ఎంట్రీ నే లభించింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు.

ఇక రెండో సినిమా స్పీడున్నోడు చేసాడు , అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇది కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దాని తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో జయ జానకి నాయక చిత్రాన్ని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించారు దాని రిజల్ట్ కూడా అంతే ! ఘోరంగా దెబ్బతింది జయ జానకి నాయక . ఇక ఇప్పుడేమో సాక్ష్యం సినిమా చేసాడు ఇది కూడా భారీ బడ్జెట్ తో తీశారు. కట్ చేస్తే దీనికి కూడా ప్లాప్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు నాలుగు సినిమాలు చేస్తే మొదటి సినిమా మినహా అన్ని ప్లాప్ చిత్రాలే ! భారీ బడ్జెట్ పెడితే సినిమాలు హిట్ కావు కానీ బెల్లంకొండ మాత్రం మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. వరుసగా దెబ్బలు తగులుతున్నప్పటికి ఇతడు మాత్రం మారడం లేదు. కావాల్సింది మంచి కథ , సరైన కథనం దానికి తగ్గ నటీనటులు అంతేకాని భారీ బడ్జెట్ పెట్టి భారీ ఎత్తున పెద్ద పెద్ద నటీనటులను పెట్టుకుంటే సినిమా హిట్ కాదని ఎప్పుడు అర్థం అవుతుందో ? ఏమిటో ? ఈరోజు విడుదలైన సాక్ష్యం చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో బెల్లంకొండ ఆశలు గల్లంతైనట్లే !

English Title: saakshyam movie teach a lesson to bellamkonda