పాపం రాజ్ తరుణ్.. సాడ్ ఎండింగ్ అంటున్నారే!


Sad ending for Raj Taruns Iddari Lokam Okate
Sad ending for Raj Taruns Iddari Lokam Okate

యంగ్ హీరో రాజ్ తరుణ్, ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి మొదటి మూడు సినిమాలతోనే సూపర్ హిట్లు కొట్టాడు. అయితే ఆ తర్వాత అతని కెరీర్ పడుతూ లేస్తూ ముందుకు సాగింది. ఇప్పుడైతే పూర్తిగా డౌన్ అయిపోయింది. రీసెంట్ గా వచ్చిన సినిమాలేవీ ఆదరణ పొందకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్ తరుణ్ కెరీర్ నే ప్రమాదంలోకి నెట్టేస్తోంది. అయితే తెలిసో తెలియకో మనోడు చేసిన ఒక పని వల్ల ఇప్పటికీ రాజ్ తరుణ్ కు సినిమాలు వస్తున్నాయి.

రాజ్ తరుణ్ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు దిల్ రాజుతో మూడు సినిమాల డీల్ సైన్ చేసాడు. అందులో మొదటి సినిమా లవర్ గతేడాది విడుదలై దారుణమైన ఫలితాన్ని అందుకుంది. రాజ్ తరుణ్ మార్కెట్ పూర్తిగా డౌన్ అయిపోయినా కానీ దిల్ రాజు కమిట్మెంట్ కు కట్టుబడి రెండో సినిమా చేసాడు. అదే ఇద్దరి లోకం ఒకటే. షాలిని పాండే హీరోయిన్ గా కొత్త దర్శకుడితో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ఒక విదేశీ భాషా చిత్రం ఆధారమని తెలుస్తోంది. ఇందులో కథ ప్రకారం సాడ్ ఎండింగ్ ఉంటుందిట. అంటే హీరో, హీరోయిన్లు ఆఖర్లో కలవరు. సాధారణంగా హీరోయిన్ కోసం హీరో త్యాగం చేస్తాడు కానీ ఇక్కడ హీరోయిన్ హీరో కోసం త్యాగం చేస్తుంది. అదే ఈ సినిమాలో మెయిన్ యూఎస్పి అని చెబుతున్నారు.

మాములుగా తెలుగు ప్రేక్షకులు సాడ్ ఎండింగ్స్ ను ఇష్టపడరు. అయితే రాజ్ తరుణ్ కు ఎలాంటి ఇమేజ్ ఇంకా రాని కారణంగా ఈ ప్రయోగం వర్కౌట్ అవుతుందని దిల్ రాజు నమ్ముతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మరో విశేషమేమిటంటే దిల్ రాజు నిర్మాణంలో అశోక్ గల్లా హీరోగా ఒక సినిమా ముహూర్తం జరిగి కూడా ఆగిపోయింది కదా. అది ఇదే కథ. ఇప్పుడు రాజ్ తరుణ్ తో తీస్తున్నారన్నమాట. మరి దిల్ రాజు నమ్మకం నిలబడుతుందో లేదో చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి మరి.