తీవ్ర విషాదంలో రజనీకాంత్ కుటుంబం


sad incident in rajinikanth houseసూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది . రజనీకాంత్ అన్న సత్యనారాయణన్ భార్య కళావతి బాయి (70) చనిపోయింది . గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కళావతి బాయి ఆదివారం అర్ధరాత్రి బెంగుళూర్ లో చనిపోయింది. ఆమె అంత్యక్రియల కోసం కుటంబ సమేతంగా బెంగుళూర్ వెళ్ళాడు రజనీకాంత్ . వదిన మరణంతో రజనీకాంత్ ఇంట విషాదం నెలకొంది . రజనీకాంత్ చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను కోల్పోవడంతో అన్నా – వదిన ల దగ్గరే పెరిగాడు . దాంతో అన్నా – వదినలంటే ఎనలేని గౌరవం , ప్రేమ రజనీకాంత్ కు .

అంత్యక్రియలు పూర్తయ్యాక మళ్ళీ షూటింగ్ పనిలో పడనున్నాడు రజనీ . ప్రస్తుతం రజనీ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . కాలా చిత్రం కూడా ఘోర పరాజయం పొందడంతో రజనీ తో పాటుగా అభిమానుల ఆశలన్నీ రోబో సీక్వెల్ 2. 0 పైనే ఉన్నాయి , కానీ ఆ సినిమా మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది ఏంటో !

English Title: sad incident in rajinikanth house