స‌త్య‌మూర్తి బాట‌లో రాక్‌స్టార్ త‌మ్ముడు!

స‌త్య‌మూర్తి బాట‌లో రాక్‌స్టార్ త‌మ్ముడు!
స‌త్య‌మూర్తి బాట‌లో రాక్‌స్టార్ త‌మ్ముడు!

రాక్‌స్టార్ దేవిశ్రీ‌ప్ర‌సాద్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా స్టార్ స్టేట‌స్‌ని సొంతం చేసుకున్నారు. ఆయ‌న త‌మ్ముడు సాగ‌ర్ గ‌త కొంత కాలంగా గాయ‌కుడిగా పాపుల‌ర్ అవుతున్నారు. అయితే తాజాగా సాగ‌ర్ కొత్త‌దారిని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. కొన్ని చిత్రాల‌కు పాట‌ల ర‌చ‌యిత‌గా కూడా వ్య‌వ‌హ‌రించిన సాగ‌ర్ పూరి సినిమాలో కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నార‌ట‌.

దేవిశ్రీ‌ప్ర‌సాద్‌, సాగ‌ర్‌ల తండ్రి స‌త్య‌మూర్తి పెద్ద ర‌చ‌యిత‌. ఆయ‌న క‌థ అందించిన చిత్రాలు మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మ‌లుపు తిప్పాయి కూడా. ఇండ‌స్ట్రీలో పాపుల‌ర్ రైట‌ర్‌గా పేరు తెచ్చుకున్న ఆయ‌న లెగ‌స్సీని త‌న‌యుడు సాగ‌ర్ కంటిన్యూ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇందులో భాగంగా ఆయ‌న ర‌చ‌యిత‌గా మారుతున్న‌ట్టు తెలిసింది.

గ‌తంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `రాక్ష‌సుడు` చిత్రానికి మాటల ర‌చ‌యిత‌గా మారిన సాగ‌ర్ తాజాగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న `ఫైట‌ర్‌` చిత్రానికి కూడా మాట‌లు అందిస్తున్ంనార‌ట‌. సెన్సేష‌న‌ల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు. త‌మిళ వెర్ష‌న్‌కి స‌గ‌ర్ మాట‌లు అందిస్తున్నార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ద‌ర్శ‌కుడు పూరి వెల్ల‌డించ‌డం విశేషం.