మొత్తానికి ఇద్దరూ హిట్ కొట్టేసారు


చిత్రలహరి చిత్రంతో హీరో సాయి ధరమ్ తేజ్ , సునీల్ ఇద్దరు కూడా హిట్ కొట్టారు . చిత్రలహరి బ్లాక్ బస్టర్ ఏమి కాదు కానీ ఓ మాదిరి హిట్ మాత్రం అయ్యింది . సాయి ధరమ్ తేజ్ కు వరుసగా ఆరు డిజాస్టర్ లు వచ్చాయి దాంతో కెరీర్ అగమ్యగోచరంగా తయారయ్యింది . ఇక సునీల్ పరిస్థితి కూడా ఇలాంటిదే ! కమెడియన్ గా సక్సెస్ అయ్యాక హీరోగా మారాడు , మొదట్లో మంచి హిట్స్ కొట్టాడు కానీ సీన్ రివర్స్ అయింది .

దాంతో వరుసగా అట్టర్ ప్లాప్ లను ఎదుర్కొన్నాడు సునీల్ . వరుస పరాజయాలతో సునీల్ కెరీర్ అయిపొయింది అని అనుకుంటున్న సమయంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మళ్ళీ వేషాలు వేయడం మొదలు పెట్టాడు కానీ సక్సెస్ అందలేదు ఒకవేళ అందినా సునీల్ ప్రేక్షకులను అలరించలేక పోయాడు . కానీ చిత్రలహరి చిత్రంలో మాత్రం ప్రేక్షకులను నవ్వించి హిట్ కొట్టాడు , మళ్ళీ తన పేరు నిలబెట్టుకున్నాడు . దాంతో సునీల్ తో పాటుగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా చాలా సంతోషంగా ఉన్నారు . ఏప్రిల్ 12న రిలీజ్ అయిన చిత్రలహరి చిత్రానికి హిట్ టాక్ వచ్చింది అలాగే మంచి వసూళ్లు కూడా వస్తున్నాయి .