డిజాస్టర్ లలో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన హీరో


sai dharam tej completes six disastersడిజాస్టర్ లలో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ . సుప్రీమ్ వంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత చేసిన తిక్క సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే డిజాస్టర్ గా తేలింది కాగా ఆ సినిమా తర్వాత అయినా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండే ఎందుకంటే వరుస విజయాలు సాధిస్తున్న తరుణంలో తిక్క పెద్ద దెబ్బ కొట్టింది సాయిధరమ్ తేజ్ ని . దాని తర్వాత వరుసగా వచ్చిన చిత్రాలన్నీ ఘోర పరాజయాలు అందుకున్నవే !

తిక్క , విన్నర్ , నక్షత్రం , జవాన్ , ఇంటలిజెంట్ చిత్రాలు వరుసగా దెబ్బ కొట్టగా తాజాగా విడుదలైన తేజ్ ఐ లవ్ యు చిత్రం కూడా మెగా మేనల్లుడి ని దారుణమైన దెబ్బ కొట్టింది దాంతో వరుసగా ఆరు చిత్రాలు డిజాస్టర్ లు అందుకున్న అరుదైన ఘన చరిత్ర సొంతం చేసుకున్నాడు . చెత్తరికార్డ్ ని తనపేరున పెట్టుకున్నాడు మెగా మేనల్లుడు .

ప్రేమకథా చిత్రాల దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కాబట్టి తప్పకుండా ఓ మాదిరి హిట్ అయినా అవుతుందని ఆశించాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కానీ అతడి ఆశలన్నీ అడియాసలయ్యాయి తేజ్ ఐ లవ్ యు చిత్రంతో . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు డిజాస్టర్ లను అందుకున్న సాయి ధరమ్ తేజ్ ఇకనైనా కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కెరీర్ పరంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అవుతుంది .

English Title: sai dharam tej completes six disasters