హిట్టు కొట్టిన మెగా హీరో


మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు హిట్టు కొట్టాడు చిత్రలహరి చిత్రంతో . వరుసగా ఆరు డిజాస్టర్ లతో కెరీర్ డోలాయమానంలో పడిపోయిన ఈ తరుణంలో డీలా పడ్డాడు అయితే చిత్రలహరి రూపంలో సాయి ధరమ్ తేజ్ కు హిట్ లభించింది దాంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు పాపం . నిన్న రిలీజ్ అయిన చిత్రలహరి చిత్రానికి హిట్ టాక్ వచ్చింది దాంతో చాలా సంతోషంగా ఉన్నాడు సాయి ధరమ్ తేజ్ .

యువతకు ఈ చిత్రం కనెక్ట్ అవుతుండటంతో చిత్రలహరి విజయం ఖాయమైపోయింది . మొత్తానికి విజయం కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సమయంలో చిత్రలహరి రూపంలో విజయం వరించింది . కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రలహరి లో కళ్యాణి ప్రియదర్శన్ , నివేదా పేతురాజ్ లు హీరోయిన్ లుగా నటించారు . కెరీర్ మళ్ళీ ఒడ్డున పడటంతో ఈసారి చేసే సినిమాలు జాగ్రత్తగా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మెగా మేనల్లుడు .