సుప్రీమ్‌ హీరో ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు?


సుప్రీమ్‌ హీరో ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు?
సుప్రీమ్‌ హీరో ఎందుకు ఎమోష‌న‌ల్ అయ్యారు?

లాక్‌డౌన్ కార‌ణంగా గ‌త ఎనిమిది నెల‌లుగా థియేట‌ర్లు మూసివేయ‌బ‌డ్డాయి. దీంతో ఇండ‌స్ట్రీతో పాటు థియేట‌ర్ల‌పై ఆధార‌ప‌డిన చాలా మంది జీవితాలు రోడ్డున ప‌డ్డాయి. థియేట‌ర్లు రీఓపెన్ అయితే కొన్ని వేల మందికి ఉపాది ల‌భిస్తుంది. ఈ ఆలోచ‌నే చాలా మందిని భావోద్వేగానికి గురిచేస్తోంది. థియేట‌ర్ల రీ ఓపెన్ కోసం దేశ వ్యాప్తంగా సినీ ఇండ‌స్ట్రీ వేయి క‌ళ్ల‌తో ఎదురుచూస్తోంది.

చాలా మంది స్టార్ హీరోల‌తో పాటు చిన్న హీరోలు, డైరెక్ట‌ర్‌లు, నిర్మాత‌లు.. డిస్ట్రీబ్యూట‌ర్లు.. ఎగ్జిబిట‌ర్లు థియేట‌ర్ల రీఓపెన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో క‌న్న‌డ ఇండ‌స్ట్రీకి చెందిన స్టార్ హీరోలు కొంత మంది క‌లిసి `క‌మ్ లెట్స్ సెల‌బ్రేట్ సినిమా అగైన్‌` అంటూ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోని చూసిన స్టార్ డైరెక్ట‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యారు. `ఈ వీడియో చూసి క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయి. మళ్ళీ ఆ రోజులు రావాలి .  విజిల్స్ వెయ్యాలి , పేపర్స్ ఎగరాలి . చొక్కాలు చిరగాలి .. సినిమా థియేటర్ మన అమ్మ` అని ట్వీట్ చేశారు.

పూరి ట్వీట్‌ని రీ ట్వీట్ చేసిన సాయి ‌ధ‌ర‌మ్‌తేజ్ భావోద్వేగానికి లోన‌య్యారు. తిరిగి థియేట‌ర్లు ఓపెన్ చేయ‌డానికి ఎదురుచూస్తున్నాను. అని ట్విట్ చేసి ఎమోష‌న‌ల్ అయ్యారు. త‌ను న‌టిస్తున్న తాజా చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`. గ‌త ఎనిమిది నెల‌లుగా థియేట‌ర్లు ఓపెన్ కాక‌పోవ‌డంతో ఓటీటీ నా థియేట‌రా అని ఊగీస‌లాడుతోంది. ఇప్ప‌టికైనా సుప్రీమ్ హీరో క‌ల నెర‌వేరుతుందా? అని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.