వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ పై స్పందించిన సాయి తేజ్వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ పై స్పందించిన సాయి తేజ్
వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ పై స్పందించిన సాయి తేజ్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా మారిపోయాడు. చిత్రలహరి టైమ్ నుండి సాయి తేజ్ గానే తన పేరుని టైటిల్స్ లో, ప్రమోషన్స్ లో వాదమంటున్నాడు. అది మంచి ఫలితాన్ని ఇవ్వడంతో తన నెక్స్ట్ సినిమాలకు కూడా దాన్నే కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం సాయి తేజ్ హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ప్రతిరోజూ పండగే. మరికొన్ని గంటల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కెరీర్ మొదట్లో మంచి హిట్స్ అందుకున్న తేజ్, ఆ తర్వాత వరస డిజాస్టర్లను తన ఖాతాలో వేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒకటో రెండో కాదు. ఏకంగా అరడజను ప్లాపులను ఎదుర్కొన్నాడు తేజ్. అయితే ఈ ఏడాది చిత్రలహరి చిత్రంతో తన పనైపోలేదని నిరూపించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇతనికి సినిమా హిట్ అవ్వడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ పండగే కనుక బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఇక తేజ్ కెరీర్ మళ్ళీ ట్రాక్ లో పడ్డట్లే. ఈ నేపథ్యంలో ప్రామిసింగ్ గా కనిపిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెట్టుకున్నాడు.

అందుకే ఈ చిత్రానికి ప్రమోషన్స్ విషయంలో కూడా ఎక్కడా తగ్గట్లేదు. ప్రమోషనల్ టూర్స్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో తేజ్ కు మీడియా ఇంటరాక్షన్ లో భాగంగా తేజ్ మాట్లాడుతూ తానూ వరుణ్ తేజ్ కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాడు. మంచి కథ దొరికితే కచ్చితంగా ఇద్దరం కలిసి నటిస్తామని అంటున్నాడు. చిత్రలహరి నుండి కెరీర్ లో సెకండ్ ఫేజ్ గా భావిస్తోన్న తేజ్, వరస హిట్స్ కొట్టాలన్న ప్లానింగ్ లో ఉన్నాడు. అందుకే వరసగా ప్రామిసింగ్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. వరుణ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తే కచ్చితంగా అది ఇద్దరికీ కలిసొచ్చేది అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వరుణ్ తేజ్ కూడా కెరీర్ పరంగా ఇప్పుడు దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ చిత్రాలతో వరస హిట్లు అందుకున్నాడు. ఇప్పుడు ఒక బాక్సింగ్ నేపధ్యమున్న సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత ఇంకా ఎటువంటి కథలకు కమిట్మెంట్స్ ఇవ్వలేదు. తేజ్ ప్రస్తుతం సోలో లైఫ్ సో బెటరు సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక కూడా ఎటువంటి కమిట్మెంట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఇద్దరూ కలిసి ఏమైనా సినిమా చేసే అవకాశం వచ్చే ఏడాది వస్తుందేమో చూడాలి.