డిజాస్టర్ కాంబో అయినా తేజ్ తగ్గనంటున్నాడు


sai dharam tej interested to work with thaman
sai dharam tej interested to work with thaman

ఏ ఇండస్ట్రీలోనైనా సెంటిమెంట్స్ ఉంటాయి అయితే అది సినీ ఇండస్ట్రీ అయితే మరింతగా సెంటిమెంట్స్ ను ఫాలో అవుతారు. ఎవరు మీదైనా ఐరన్ లెగ్ అన్న ముద్ర పడితే ఇక అంతే, వారి కెరీర్ దాదాపు ముగిసిపోయినట్లే. ఇంతలా సెంటిమెంట్స్ ను ఫాలో అయ్యే ఇండస్ట్రీలో ఉంటున్న సాయి ధరమ్ తేజ్ మాత్రం డిజాస్టర్ కాంబోను కొనసాగించాలి అనుకుంటున్నాడు.

ఆ కాంబోనే సాయి ధరం తేజ్ – థమన్ లది. వీరిద్దరూ ఇప్పటివరకూ కలిసి నాలుగు సినిమాలకు పనిచేసారు. తిక్క, విన్నర్, జవాన్, ఇంటిలిజెంట్. ఇందులో తిక్క, విన్నర్, జవాన్ లలో పాటలు మంచి హిట్ అయ్యాయి. అయితే ఈ నాలుగు చిత్రాలూ మాత్రం డిజాస్టర్ అయ్యాయి. సాధారణంగా అయితే ఈ కాంబో మళ్ళీ సెట్ అవ్వకూడదు.

కానీ ప్రస్తుతం సాయి తేజ్ చేస్తున్న ప్రతిరోజూ పండగే చిత్రానికి థమన్ సంగీత దర్శకుడు. అంతేనా.. ఈ చిత్రం తర్వాత తేజ్, సుబ్బు అనే నూతన దర్శకుడి సినిమా సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందించనున్నాడు. ఈ రకంగా డిజాస్టర్స్ ఉన్నా కూడా తేజ్ థమన్ తో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడంటే ఆశ్చర్యకరమే. మరి ఈ రెండు చిత్రాలైనా ఈ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాయేమో చూద్దాం.