నవంబర్ నుండి తేజ్ సోలో లైఫ్ సో బెటర్నవంబర్ నుండి తేజ్ సోలో లైఫ్ సో బెటర్
నవంబర్ నుండి తేజ్ సోలో లైఫ్ సో బెటర్

డబల్ హ్యాట్రిక్ పరాజయాలతో పూర్తిగా డీలా పడ్డ మెగా హీరో, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో డీసెంట్ విజయాన్ని అందుకుని ట్రాక్ లో పడ్డాడు. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిరోజూ పండగే చిత్రంలో నటిస్తున్న తేజ్ మరో సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెల్సిందే.

కొత్త దర్శకుడు సుబ్బును దర్శకుడిగా పరిచయం చేస్తూ సోలో బ్రతుకే సో బెటర్ అనే విభిన్న టైటిల్ తో సినిమాకు కమిట్ అయ్యాడు తేజ్. సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈరోజే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నవంబర్ నుండి చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

ఈలోపు తేజ్ ప్రతిరోజూ పండగే షూటింగ్ ను పూర్తి చేస్తాడు. డిసెంబర్ లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా ఎంపికైంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.