పండగ అమెరికాలో జరుపుకుంటున్నారు


Sai Dharam Tej New Movie Trailer Release date
పండగ అమెరికాలో జరుపుకుంటున్నారు

వరుస పరాజయాల మధ్య ఉన్న ‘సాయి ధరమ్ తేజ్‘ కి మంచి బూస్ట్ అప్ ఇచ్చింది చిత్రలహరి సినిమా. కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే పెద్ద కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. కళ్యాణి ప్రియదర్శన్, నివేద పేతురాజ్ కథానాయికలుగా నటించారు. సునీల్ గారు కూడా ఒక కీలక పాత్రలో దర్శనం ఇచ్చారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

ఇక చిత్రలహరి ఇచ్చిన ఎనర్జీతో వెంటనే మారుతి దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగే’ సినిమాని మొదలు పెట్టేసాడు. పల్లెటూరి నేపథ్యంలో తాత-మనువల మధ్య పూర్తిగా కుటుంబ నేపధ్యంగా సాగనున్న ఈ సినిమా మొదటి పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. రేపు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా మొదటి చిన్న వీడియో ని రిలీజ్ చేస్తున్నారు. రేపు ఆ వీడియో లో కూడా తాత-మనువల గురించి ఉండబోతుంది అని అంటున్నారు. హీరోయిన్ గా రాశి ఖన్నా రెండవసారి సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ప్రతి రోజు పండగే సినిమా షూటింగ్ లో భాగంగా అమెరికాకి వెళ్లనున్నారు అని తెలుస్తుంది. ఇక మారుతి గారి గత సినిమాలు చూసుకుంటే కామెడీ ప్రధానంగా సాగుతున్నాయి. ఈ సినిమాలో కూడా కామెడీ మంచిగా పండుతుంది అని దానికి దగ్గ పాత్రలు కూడా సినిమాలో ఉన్నాయి అని అంటున్నారు దర్శకులు. జి.ఏ2 మరియు  యూ.వి. పిక్చర్స్ బ్యానర్లో  నిర్మాత అల్లు అరవింద్ గారు మరియు బన్నీ వాసు గారు సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ లో విడుదల కానున్న ఈ సినిమా మీద జనాలలో భారీగా అంచనాలు ఉన్నాయి.