సాయిధ‌ర‌మ్‌తేజ్ కొత్త స్లోగ‌న్ వ‌చ్చేస్తోంది!


 సాయిధ‌ర‌మ్‌తేజ్ కొత్త స్లోగ‌న్ వ‌చ్చేస్తోంది!
సాయిధ‌ర‌మ్‌తేజ్ కొత్త స్లోగ‌న్ వ‌చ్చేస్తోంది!

సాయిధ‌ర‌మ్‌తేజ్‌.. మెగా కాంపౌండ్ నుంచి ఎంట‌రైనా త‌న కంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. గ‌త ఏడాది కిషోర్ తిరుమ‌ల చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన సాయిధ‌ర‌మ్‌తేజ్ ఇటీవ‌ల మారుతితో క‌లిసి చేసిన `ప్ర‌తిరోజు పండ‌గే` సూప‌ర్‌హిట్ కావ‌డంతో మాంచి జోష్‌మీదున్నాడు.

`ప్ర‌తిరోజు పండ‌గే` త‌రువాత సాయిధ‌ర‌మ్‌తేజ్ వెంట‌నే మ‌రో చిత్రాన్ని లైన్‌లో పెట్టిన విష‌యం తెలిసిందే. సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీచిత్ర బ్యాన‌ర్‌పై భోగ‌వ‌ల్లి బాపినీడు నిర్మిస్తున్నారు. ఇస్మార్ట్ గాళ్ న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో వుంది.

ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ వీడియోని వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని హీరో సాయిధ‌ర‌మ్‌తేజ్ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. `సోలో సోద‌ర సోద‌రీమ‌ణులారా ఈ వాలెంటైన్స్‌వీకెండ్ మ‌నం అంతా క‌లిసి జ‌రుపుకుందాం. మ‌న స్లోగ‌న్ ఒక‌టే సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` అంటూ ట్వీట్ చేశారు. మే 1న ఈ సినిమాని వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు.