మరో క్యాచీ టైటిల్ తో మన ముందుకు రాబోతున్న తేజ్


sai dharam tej next gets interesting title
sai dharam tej next gets interesting title

డబల్ హ్యాట్రిక్ ప్లాపులు సాయి ధరమ్ తేజ్ ఆలోచనాధోరణిని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు కథ బాగుంటే తప్ప తేజ్ ఏ సినిమా ఒప్పుకోవట్లేదు. అలాగే టైటిల్ విషయంలో పర్టిక్యూలర్ గా ఉంటున్నాడు. ఎందుకంటే ఏ సినిమాకైనా టైటిల్ అనేది అత్యంత కీలకమైంది. టైటిల్ బాగుంటే అదే సగం ప్రచారానికి పనికొస్తుంది. ఈ నేపథ్యంలో ఇటీవలే చిత్రలహరి టైటిల్ తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడటంలో సక్సెస్ అయిన తేజ్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ప్రతిరోజూ పండగే అనే చిత్రం చేస్తున్నాడు.

ఇది పూర్తిగా క్లాస్ టైటిల్, పేరు వినగానే మంచి ఫీల్ వస్తుంది. ఇకపోతే సాయి ధరమ్ తేజ్, సుబ్బు అనే కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్న విషయం తెల్సిందే. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి “సోలో బ్రతుకే సో బెటరు” అనే సూపర్ క్యాచీ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ చూడగానే యూత్ ను ఆకట్టుకుంటుంది అని అర్ధమైపోతుంది. మరి ఈ రెండు చిత్రాలతో తేజ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.