మెగా మేనల్లుడు తో ఛలో దర్శకుడు


sai dharam tej next movie with chalo directorమెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా కరుణాకరన్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . మామయ్య పవన్ కళ్యాణ్ కు తొలిప్రేమ వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కరుణాకరన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు సాయి ధరమ్ తేజ్ . ఆ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో తదుపరి సినిమాలపై దృష్టి పెట్టాడు మెగా మేనల్లుడు . ఇటీవలే ” ఛలో ” చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట .

ఛలో వెంకీ కుడుముల కు మొదటి సినిమా అయినప్పటికీ తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ ని కొట్టేయడంతో అతడికి బోలెడు ఛాన్స్ లు వస్తున్నాయి . ఇప్పటికే యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు ఇక ఇప్పుడేమో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఒక రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని అందించడానికి ఒప్పుకున్నాడట వెంకీ కుడుముల . మెగా మేనల్లుడు కూడా వరుసగా యాక్షన్ చిత్రాలు చేసి ఘోర పరాజయాలను అందుకున్నాడు దాంతో ప్లేట్ ఫిరాయించి ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడట సక్సెస్ కోసం .