ప్రభాస్ కు సారీ చెప్పిన సాయి ధరమ్ తేజ్… వాట్సాప్ గ్రూప్ లోంచి ఎగ్జిట్!


ప్రభాస్ కు సారీ చెప్పిన సాయి ధరమ్ తేజ్... వాట్సాప్ గ్రూప్ లోంచి ఎగ్జిట్!
ప్రభాస్ కు సారీ చెప్పిన సాయి ధరమ్ తేజ్… వాట్సాప్ గ్రూప్ లోంచి ఎగ్జిట్!

యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కు సారీ చెప్పాడు. “సారీ ప్రభాస్ అన్నా” అంటూ వాట్సాప్ లో మెసేజ్ చేసాడు. అంతే కాదు తను ఉన్న గ్రూప్ లో నుండి ఎగ్జిట్ అయిపోయాడు. ఈ పాటికే అర్ధమైపోయుంటుందిగా ఇదంతా సినిమా కోసమేనని. సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తోన్న చిత్రం సోలో బ్రతుకే సో బెటరు. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ భాగం పూర్తి చేసుకుంది. అసలైతే ఈ పాటికి సినిమా విడుదలైపోయేదే. కాకపోతే కరోనా వైరస్ ప్రభావం వల్ల ఈ సినిమా వాయిదా పడాల్సి వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట నో పెళ్లిని విడుదల చేసిన సంగతి తెల్సిందే. దీనికి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఇప్పుడు తాజా అప్డేట్ విషయానికొస్తే సాయి ధరమ్ తేజ్ ఈరోజు ట్విట్టర్ లో ఒక అప్డేట్ ఇచ్చాడు. వాట్సాప్ లో సింగిల్స్ గ్రూప్ లో ప్రభాస్, వరుణ్ తేజ్, నితిన్, నిఖిల్, రానా, సాయి ధరమ్ తేజ్ భాగమైనట్లు అందులో ఉంది. ముందు నిఖిల్, ఆపై నితిన్, ఆ తర్వాత రానా పెళ్లిళ్లు చేసుకుని ఆ వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. సాయి ధరమ్ తేజ్ కూడా సారీ ప్రభాస్ అన్నా అని చెప్పి గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాడు. అయితే ఇదంతా సినిమా అప్డేట్ కోసమేనని తెలుస్తోంది. సోలో బ్రతుకే సో బెటర్ సెకండ్ సింగిల్ ను రేపు ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారట.