సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీడు పెంచేసాడు!


సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీడు పెంచేసాడు!
సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీడు పెంచేసాడు!

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్‌తేజ్ స్పీడు పెంచేశాడు. కిషోర్ తిరుమ‌ల రూపొందించిన `చిత్ర‌ల‌హ‌రి` చిత్రంతో మ‌ళ్లీ స‌క్సెస్ రూట్‌లోకి ఎంటరైన సాయిధ‌ర‌మ్‌తేజ్ గ‌త ఏడాది చివ‌ర్లో `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో సాలీడ్ హిట్‌ని సొంతం చేసుకుని మ‌ళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో రెట్టించిన ఉత్సాహంతో వున్న ఈ మెగా మేన‌ల్లుడు తాజాగా న‌టిస్తున్న వెరైటీ చిత్రం `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` సుబ్బు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్, భోగ‌వ‌ల్లి బాపినీడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 1న విడుద‌ల కాబోతోంది. సోలో బ్ర‌తుకే సోబెట‌ర్ అనే స్లోగ‌న్‌తో ఇటీవ‌ల వ‌చ్చిన టీజ‌ర్ సినిమాపై క్రేజ్‌ని పెంచేసింది. సింగిల్ల్స్‌కి సాయిధ‌ర‌మ్‌తేజ్ లెక్చ‌ర్ ఇస్తున్న సీన్‌, ఆ సీన్ కోసం ఆర్. నారాయ‌ణ‌మూర్తి నుంచి మ‌ద‌ర్ థెరిసా క‌టౌట్‌ల‌ని వాడుకున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్‌కు ముందే సాయిధ‌ర‌మ్‌తేజ్ మ‌రో చిత్రాన్ని ఓకే చేసిన‌ట్టు తెలిసింది. `ప్ర‌స్థానం` చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌ర‌మ్‌తేజ్ ఓ చిత్రాన్ని చేయ‌బోతున్నార‌ట‌. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వుండ‌బోతోంద‌ని, ఇప్ప‌టికే స్టోరీకి దేవా క‌ట్టా వినిపించాడ‌ని. ఈ చిత్రాన్ని భ‌గ‌వాన్‌, జె. పుల్లారావు సంయుక్తంగా నిర్మించ‌నున్నారని తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే బ‌య‌టికి రానున్న‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.