మరో సినిమాను సెట్ చేసిన సాయి ధరమ్ తేజ్?


మరో సినిమాను సెట్ చేసిన సాయి ధరమ్ తేజ్?
మరో సినిమాను సెట్ చేసిన సాయి ధరమ్ తేజ్?

వరసగా రెండు హిట్స్ తర్వాత యంగ్ మెగా హీరో సాయి ధరమ్ తేజ్ హవా మీద ఉన్నాడు. వరస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమా తెరకెక్కుతోందన్న విషయం తెల్సిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేకులు పడినా ఇటీవలే తిరిగి మొదలైంది. ఈ సినిమాను ఓటిటిలో విడుదల చేస్తారు అంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఏదేమైనా ఈ సినిమా పూర్తయ్యాక దేవా కట్టా దర్శకత్వంలో మరో సినిమాను మొదలుపెట్టనున్నాడు సాయి తేజ్. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. దేవా కట్టా సినిమా కాకుండా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో సుకుమార్ కథనం అందించనున్న ఒక మిస్టిక్ థ్రిల్లర్ కు సాయి ధరమ్ తేజ్ ఓకే చెప్పిన విషయం తెల్సిందే.

తాజా సమాచారం ప్రకారం ప్రముఖ రచయిత ఆకుల శివ చెప్పిన కథకు కూడా తేజ్ ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విషయమై పూర్తి క్లారిటీ మరి కొద్ది రోజుల్లో రానుంది. అలాగే గోపీచంద్ మలినేని ఇటీవలే తేజ్ ను కలిసి సినిమా చేసే విషయమై చర్చించినట్లు సమాచారం.