ప్రతిరోజూ పండగే.. ప్రీ లుక్ లో ఇది గమనించారా?

sai dharam tej prati roju pandage pre look out
sai dharam tej prati roju pandage pre look out

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో డీసెంట్ హిట్ అందుకున్నాడు. దీని తర్వాత తేజ్ చేస్తున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ ను విడుదల చేసారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉందనే చెప్పాలి.

ఈ పోస్టర్ లో ఇద్దరు వ్యక్తుల చేతుల్ని మాత్రమే చూపించారు. ఇందులో ఒక యువకుడు, తనకన్నా పెద్ద వయసులో ఉన్న వ్యక్తికి చేయి అందించినట్లు అర్ధమవుతోంది. ఈ పోస్టర్ లో ‘వేలు విడవని బంధం’ అని ఒక ట్యాగ్ లైన్ కూడా జతచేసారు. ఇందులో యువకుడి చేయి సాయి ధరమ్ తేజ్ ది అని ఊహించవచ్చు. మరి ఆ రెండో వ్యక్తి ఎవరో రేపు ఉదయం 8 గంటలకు విడుదలయ్యే ఫస్ట్ లుక్ లో తెలిసే అవకాశముంది.

రాశి ఖన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.