డిసెంబర్ 20 నుండి ప్రతిరోజూ పండగే


డిసెంబర్ 20 నుండి ప్రతిరోజూ పండగే
డిసెంబర్ 20 నుండి ప్రతిరోజూ పండగే

క్రిస్మస్ సెలవులకు ఆరు సినిమాల దాకా షెడ్యూల్ అయి ఉన్నా వాటి గురించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఆయా చిత్ర నిర్మాతలు. దాంతో ఆ సినిమాలు అసలు క్రిస్మస్ కు విడుదలవుతాయో లేదో కూడా ప్రేక్షకులకు ఎటువంటి క్లారిటీ లేదు. అటు డిస్ట్రబ్యూటర్లు కూడా దీనిపై నిర్మాతలతో ఆరా తీస్తున్నా క్లారిటీ మాత్రం రావట్లేదు.

అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న ప్రతిరోజూ పండగే చిత్రం రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ కు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో దానికి థాంక్స్ చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేసి అందులోనే ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుందని తెలియజేసారు.

అదే రోజున బాలకృష్ణ నటిస్తున్న రూలర్ కూడా విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఎక్కడా అధికారిక సమాచారం లేదు. దీంతో అనుష్క నిశ్శబ్దం కూడా అదే రోజున విడుదలవుతుందని అంటున్నారు. వీరు కూడా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటిస్తే ఏ గొడవా ఉండదు.