అల్లు అర్జున్ తో గొడవ కాలేదట !


అల్లు అర్జున్ తో నాకు గొడవ జరిగినట్లు కొంతమంది లేనిపోని పుకార్లను సృష్టిస్తున్నారని , అయితే అది వాస్తవం కాదని మేము ఎప్పుడు కలిసినా ప్రేమాభిమానాలతో మాట్లాడుకుంటామని అంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ . అల్లు అర్జున్ తో సాయి ధరమ్ తేజ్ కు గొడవ జరిగిందని పుకార్లు రావడంతో ఇలా స్పందించాడు సాయి ధరమ్ తేజ్ .

అయితే నేను రెగ్యులర్ గా వరుణ్ తేజ్ తో అలాగే రాంచరణ్ తో కలుస్తాను కానీ అల్లు అర్జున్ ని మాత్రం రెగ్యులర్ గా కలవనని , అయితే అప్పుడప్పుడు మాత్రమే బన్నీ ని కలుస్తానని అలాంటప్పుడు మా మధ్య గొడవ జరగడానికి ఆస్కారం ఎక్కడ ఉంటుందని అంటున్నాడు సాయి ధరమ్ తేజ్ . మెగా మేనల్లుడు ఇటీవలే చిత్రలహరి తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అయితే పెద్ద హిట్ కాదు కానీ ఫరవాలేదనే స్థాయిలో వసూళ్లు వస్తున్నాయి .