మరో డెబ్యూ డైరెక్టర్ కథకు ఎస్ చెప్పిన తేజ్?

మరో డెబ్యూ డైరెక్టర్ కథకు ఎస్ చెప్పిన తేజ్?
మరో డెబ్యూ డైరెక్టర్ కథకు ఎస్ చెప్పిన తేజ్?

యంగ్ మెగా సాయి ధరమ్ తేజ్ వరస ప్లాపుల తర్వాత తన మైండ్ సెట్ ను పూర్తిగా మార్చుకున్నాడు. కేవలం దర్శకుడ్ని మాత్రమే నమ్మడం కాకుండా స్క్రిప్ట్ కు ప్రాధాన్యతను ఇస్తున్నాడు తేజ్. అందుకే 2019లో వరసగా రెండు హిట్స్ ను సాధించాడు. అలాగే కొత్త దర్శకులకు అవకాశం ఇస్తున్నాడు. సుబ్బు అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదలవుతోంది.

ఇంకా ప్లాపుల్లో మగ్గుతున్న దేవా కట్టాతో తేజ్ పొలిటికల్ థ్రిల్లర్ ను చేస్తున్నాడు. అంతే కాకుండా కార్తీక్ దండు అనే మరో నూతన దర్శకుడితో మిస్టిక్ థ్రిల్లర్ ను మొదలుపెడతాడు.

ఇవన్నీ కాకుండా సాయి ధరమ్ తేజ్ మరో ప్రాజెక్టుకు కూడా ఎస్ చెబుతున్నట్లు తెలుస్తోంది. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ వద్ద అసోసియేట్ గా చాలా ఏళ్ళు వర్క్ చేస్తోన్న రామ్ చెప్పిన స్టోరీ నచ్చిన తేజ్ ఈ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపాడట. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.