మరో కొత్త సినిమాకి సైన్ చేసిన సాయి ధరమ్ తేజ్!


Sai Dharam Tej Up Coming Projects
Sai Dharam Tej Up Coming Projects

చిత్రలహరి‘ హిట్ తో సాయి ధరమ్ తేజ్ కేరియర్ కొంత గాడిలో పడిందనే చెప్పాలి.. ఇప్పుడు యమస్పీడ్ గా గేర్ మార్చి వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మారుతీ దర్శకత్వంలో ‘ప్రతి రోజు పండగ’ చిత్రంలో నటిస్తున్నారు.. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నవంబర్లో రిలీజ్ కానుంది.. ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ దేవా కట్ట దర్శకత్వంలో నటించనున్నారు. వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య’ వంటి డిఫరెంట్ చిత్రాలను రూపొందించిన దేవా మరో విభిన్నమైన కథాంశంతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అక్టోబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.. ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.. దీని తరువాత సాయి ధరమ్ తేజ్ బి. వి. యస్. ఎన్ ప్రసాద్ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు.. ఈ చిత్రానికి సుబ్రమన్యం దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది..!!
సాయి ధరమ్ తేజ్, దేవ కట్ట, జె.భగవాన్, జె.పుల్లారావు..