మెగా మేన‌ల్లుడు కూడా సిక్స్‌ప్యాక్ చూసిస్తాడ‌ట‌!


Sai Dharamtej to flaunt his six pack
Sai Dharamtej to flaunt his six pack

తెలుగు సినిమాల్లో సిక్స్ ప్యాక్ అన్న‌ది అప్ప‌ల్లో ట్రెండ్‌గా నిలిచింది. ఇప్ప‌డంతా 8 ప్యాక్ చేస్తూ హల్‌చ‌ల్ చేస్తున్నారు. అయితే ఈ రేసులోకి ఆల‌స్యంగా మెగా కాంపౌండ్ నుంచి మెగా మేన‌ల్లుడు రాబోతున్నాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్ తొలి సారి సిక్స్ ప్యాక్ బాడీతో అల‌రించ‌డానికి రెడీ అయిపోతున్నాడు. సాయిధ‌ర‌మ్‌తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం `ప్ర‌తిరోజు పండ‌గే`. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోంది. బంధాలు, అనుబంధాల నేప‌థ్యంలో బంధాల విలువ‌ని నేటి స‌మాజం మ‌ర్చిపోయి కాలం వెంట‌ప‌రుగెడుతూ మాన‌వ‌తా విలువ‌ల్ని మ‌ర్చిపోతోంద‌ని గుర్తు చేస్తూ ఈ చిత్రం ద్వారా మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు సందేశాన్ని అందిస్తున్నారు.

ఈ చిత్రంలోని ఓ స‌న్నివేశంలో బాలీవుడ్ హీరో స‌ల్మాన్‌ఖాన్ త‌ర‌హాలో సాయిధ‌ర‌మ్ తేజ్ ష‌ర్ట్ విప్పి సిక్స్ ప్యాక్ బాడీని చూపించ‌బోతున్నాడ‌ని, ఈ ప‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్‌గా నిలుస్తాయ‌ని చిత్ర వ‌ర్గాలు చెబుతున్నాయి. సినిమాలో సాయిధ‌ర‌మ్ తేజ్ హోమం చేస్తున్న సంద‌ర్భంలో ఈ స‌న్నివేశం వ‌స్తుంద‌ని, ఈ చిన్న సీన్ కోసం తేజుప్ర‌త్యేకంగా ఓ ట్రైన‌ర్ స‌హాయంతో సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఎంతో శ్ర‌మించాడ‌ట‌. `చిత్ర‌ల‌హ‌రి`తో సక్సెస్ బాట‌ప‌ట్టిన సాయిధ‌ర‌మ్‌తేజ్ `ప్ర‌తిరోజు పండ‌గే` చిత్రంతో మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకోవాల‌న్న క‌సితో వున్నాడ‌ని, హీరోగా తేజు కెరీర్‌ని ఈ సినిమా మ‌లుపు తిప్పుతుంద‌ని చిత్ర బృందం చెబుతోంది.