`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?

`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?
`ఆర్ఆర్ఆర్‌` ఫ్యాన్స్‌కి విజువ‌ల్ ఫీస్టేనా?

టాలీవుడ్ చ‌రిత్ర‌లో చాలా ఏళ్ల త‌రువాత ఇద్ద‌రు క్రేజీ స్టార్‌లు క‌లిసి న‌టిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రాన్ని డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్నారు. చారిత్ర‌క అంశాల నేప‌థ్యంలో ఫిక్షన్‌గా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి అత్యంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. బ్రిటీష్ వారిపై నిజాం నిరంకుశ పాల‌పై జ‌రిగిన స్వాతంత్య్ర పోరాటంలో‌ చ‌రిత్ర‌లో నిలిచిపోయిన ఇద్ద‌రు యోధులు అల్లూరి సీతారామ‌రాజు, కొమ‌రం భీం.

ఈ ఇద్ద‌రు క‌లిసి ఓ ద‌శ‌లో పోరాటం చేశారన్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు అదే నిజ‌మైతే అన్న ఫిక్ష‌న‌ల్ క‌థ‌తో జ‌క్క‌న్న ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో భార‌తీయ తెర‌పై మునుపెన్న‌డూ రాని విధంగా స‌రికొత్త పంథాలో తెర‌పైకి తీసుకొస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు చ‌జ‌రిగిన షూటింగ్‌తో 75 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.

బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని ఇటీవ‌ల గండిపేట్‌లో వేసిన ప్ర‌త్యేక సెట్‌లో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా దెబ్బ‌తో ఆ ప్ర‌య‌త్నాన్ని విర‌మించుకున్నారు. అయితే గ‌త కొంత కాలంగా అటు మెగా ఫ్యాన్స్‌ని, ఇటు యంగ్ టైగర్ ఫ్యాన్స్‌ని ఓ ప్ర‌శ్న క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది.

ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్స్ క‌లిసి న‌టిస్తున్నారు. అయితే ప్ర‌తీ సినిమా త‌ర‌హాలో ఒక్క‌రికి మాత్ర‌మే ప్రాధాన్య‌త వుంటుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే ఇది. అయితే ఇది నిజం కాద‌ని ర‌చ‌యిత బుర్రా సాయిమాధ‌వ్ అంటున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల పాత్ర‌ల‌కు స‌మ ప్రాధాన్య‌త వుంటుంద‌ని, ఫ్యాన్స్‌కు ఈ మూవీ విజువ‌ల్ ఫీస్ట్‌గా వుంటుంద‌ని ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ర‌చ‌యిత సాయి మాధ‌వ్ బుర్రా వెల్ల‌డించారు.