నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మరో పేరు లైన్లోకి?


నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మరో పేరు లైన్లోకి?
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మరో పేరు లైన్లోకి?

నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ న్యూస్ ఇప్పటిది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాలో నానుతూ వస్తోంది. అప్పట్లో మోక్షజ్ఞ ఇంకా చిన్న పిల్లాడు, అప్పుడే ఎంట్రీ ఏంటి అని అన్నారు. ఇక రెండు, మూడేళ్ళ క్రితం వరకూ మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకుంటున్నాడు, త్వరలోనే ఎంట్రీ అని అన్నారు. ఆ తర్వాత అలాంటిదేం జరగట్లేదని అర్ధమైపోయింది. సో అప్పటి నుండి ఈ తరహా న్యూస్ లు తగ్గిపోయాయి. మరి ఎందుకొచ్చిందో ఏమో గత కొంత కాలంగా మళ్ళీ నందమూరి మోక్షాజ్ఞ సినిమా ఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణను ఇదే విషయమై అడిగితే దేవుడు ఎప్పుడు రాస్తే అప్పుడే జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు ఇద్దరు దర్శకులు అమితమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అటు బోయపాటి శ్రీను, ఇటు అనిల్ రావిపూడి ఇద్దరూ కూడా మోక్షజ్ఞను వెండి తెరకు పరిచయం చేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈలోగా మరో వార్త ఈ విషయంలో వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీ చిత్రానికి కథ అందించే బాధ్యత బాలయ్య ప్రముఖ రైటర్ చేతిలో పెట్టినట్లు సమాచారం. ఆయన ఎవరో కాదు సాయి మాధవ్ బుర్రా. బాలకృష్ణతో గౌతమీపుత్ర శాతకర్ణి సహా పలు చిత్రాలకు పనిచేసారు. ఇప్పుడు ఈయన మోక్షజ్ఞ మొదటి సినిమాకు కథ అందిస్తాడట. మరి దర్శకుడు ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.