రెండు కోట్లు డిమాండ్ చేసిన సాయి ప‌ల్ల‌వి?

Sai pallavi demanding 2 crores for ayyappanum koshiyum
Sai pallavi demanding 2 crores for ayyappanum koshiyum

`ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ఫిదా చేసిన న‌టి సాయిప‌ల్ల‌వి. ఈ సినిమాతో విజ‌యాల ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తున్న సాయి ప‌ల్ల‌వి సినిమా సినిమ‌బాకు త‌న క్రేజ్‌ని పెంచుకుంటూ పోతోంది. క్రేజీ హీరోయిన్‌గా ప్ర‌త్యేక స్థానాన్ని సొంతం చేసుకున్న సాయి ప‌ల్ల‌వి స్టార్ హీరోయిన్‌ల‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. త‌న క్రేజ్‌కి త‌గ్గ‌ట్టే భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తోంది.

ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం, ల‌వ్‌స్టోరీ చిత్రాల్లో న‌టిస్తున్న సాయి పల్లవి తాజాగా `అయ్యప్పనుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో పవన్ కళ్యాణ్ భార్యగా నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే ఈ పాత్రని పోషించడానికి భారీగానే వసూలు చేస్తున్న‌ద‌ట. సాయి పల్లవి ఈ మూవీ కోసం 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా మేకర్స్ ఆమెతో చర్చలు జరిపి ఆమెకు ఫాన్సీ అమౌంట్‌ని చెల్లించార‌ట‌.

ఇందులో సాయి ప‌ల్ల‌వి ప‌వ‌న్‌కు జోడీగా క‌నిపించ‌బోతోంది. ఈ యాక్షన్ డ్రామాలో రానా కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ కనిపించనుంది. మాట‌లు మాంత్రికుడు త్రివిక్రమ్  స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ అందిస్తుండ‌గా.. సాగర్ కె చంద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో రానా తండ్రిగా నటించడానికి సముద్ర‌ఖ‌ని పోషిస్తున్నారు.