ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్రానికి సాయి ప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌?

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్రానికి సాయి ప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌?
ప‌వ‌న్‌క‌ల్యాణ్ చిత్రానికి సాయి ప‌ల్ల‌వి గ్రీన్‌సిగ్న‌ల్‌?

మ‌ల‌యాళ హిట్ చిత్రం `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌`. ఈ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి ఈ మల్టీస్టార‌ర్ చిత్రంలో న‌టిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇటీవ‌లే ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభించారు. ఇందులో హీరోయిన్‌లుగా టాలెంటెడ్ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టించ‌నున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా చిత్ర బృందం సాయి ప‌ల్లవితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ట‌. ఫైన‌ల్‌గా ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌లో న‌టించ‌డానికి సాయి ప‌ల్ల‌వి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు జోడీగా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంది. రానాకు జోడీగా ఐశ్వ‌ర్యారాజేష్‌ని ఫైన‌ల్ చేశార‌ట‌. దీనికి సంబంధించిన అఫీషియ‌ల్ న్యూస్ త్వ‌ర‌లోనే మేక‌ర్స్ ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం రానాతో `విరాట ప‌ర్వం`, నాగ‌చైత‌న్య‌తో `ల‌వ్‌స్టోరీ` చిత్రాల్లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.