సాయి పల్లవి అడల్ట్ సినిమా ఒప్పుకుంటుందా


 sai pallavi in adult movieఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళ భామ సాయి పల్లవి . ఆ సినిమా తర్వాత మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఈ భామకు . ఇప్పటికే పలు తెలుగు , తమిళ , మలయాళ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ కు తాజాగా ఓ అడల్ట్ సినిమాలో నటించమని ఆఫర్ వచ్చిందట . విలక్షణ చిత్రాలకు దర్శకత్వం వహించే మిస్కిన్ ఈ అడల్ట్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు .

ఇందులో ఇప్పటికే నిత్యా మీనన్ నటించడానికి ఒప్పుకోగా , సాయి పల్లవి సైతం సుముఖంగా ఉన్నట్లు ఆ చిత్ర బృందం తెలియజేస్తోంది . మిస్కిన్ చెప్పిన కథ సాయి పల్లవి విన్నదట కానీ ఇంకా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు . ఎందుకంటే హర్రర్ అంశాలతో పాటుగా ఘాటు రొమాన్స్ ఉన్న సన్నివేశాలు కూడా ఎక్కువే ఉన్నాయట ! అవి ఆల్మోస్ట్ అడల్ట్ సినిమా రేంజ్ లో ఉంటాయట . మరి ఆ సన్నివేశాల్లో సాయి పల్లవి నటిస్తుందా ? రిజెక్ట్ చేస్తుందా ? చూడాలి .