అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌ నిరీక్ష‌ణ ఎవ‌రి కోసం?


అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌ నిరీక్ష‌ణ ఎవ‌రి కోసం?
అమ‌ర‌వీరుల స్థూపం వ‌ద్ద‌ నిరీక్ష‌ణ ఎవ‌రి కోసం?

అడివి మార్గాన ఉన్న అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌రే ఆమె ఎందుకు ఒంట‌రిగా కూర్చుని వుంది? ఎవ‌రి కోసం ఆమె నిరీక్ష‌ణ‌? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్ష‌రాలేమిటి? ఆమె ప‌క్క‌నున్న బ్యాగులో ఉన్న‌వేమిటి? ఈ ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు విడుద‌ల తర్వాతే` అంటున్నారు ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల పెట్టిన పోస్ట్ ఆక‌ట్టుకుంటోంది. ఆయ‌న తెర‌కెక్కిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`.

రానా ద‌గ్గుబాటి హీరోగా సాయిప‌ల్ల‌వి హీరోయిగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టి నందితాదాస్‌, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. టాలెంటెడ్ న‌టి సాయిప‌ల్ల‌వి పుట్టిన రోజు నేడు (మే 9). ఈ సంద‌ర్భంగా సాయి ప‌ల్ల‌వికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని ఈ రోజు ద‌ర్శ‌కుడు రిలీజ్ చేశారు.  1990 లో ఉత్త‌ర తెలంగాణ‌లో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌క్సలిజానికి ఓ ప్రేమ జంట‌కు మ‌ధ్య సాగే ర‌స‌వ‌త్త‌ర క‌థ‌, క‌థ‌నాల‌తో ఉత్త‌ర తెలంగాణ‌ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తొలి చిత్రంతోనే `నీది నాది ఒకే క‌థ‌` అంటూ ఆలోచింప‌జేసిన వేణు ఊడుగుల ఈ చిత్రం ద్వారా ఓ స‌మ‌కాలీన సామాజిక అంశాన్ని చ‌ర్చిస్తూనే ఓ హృద్య‌మైన ప్రేమ‌క‌థ‌ని చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి జ‌న‌ప‌ద గాయ‌నిగా క‌నిపించ‌బోతోంది.