ప‌వ‌న్ – రానా స‌ర‌స‌న ఆ ఇద్ద‌రు?


ప‌వ‌న్ - రానా స‌ర‌స‌న ఆ ఇద్ద‌రు?
ప‌వ‌న్ – రానా స‌ర‌స‌న ఆ ఇద్ద‌రు?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రానా ద‌గ్గుబాటి న‌టించ‌నున్న క్రేజీయెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ ఈ సోమ‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన విష‌యం తెలిసిందే. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోహియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. `అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు` ఫేమ్ సాగ‌ర్‌చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవ‌ర నాగ‌వంశీ ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ని నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంలో హీరోయిన్‌లుగా క్రేజీ భామ‌లు సాయి ప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్యా రాజేష్‌ల‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ ఇద్ద‌రితో చిత్ర బృందం టాక్స్ పూర్త‌య్యాయని, ఈ చిత్రంలో న‌టించ‌డానికి ఈ ఇద్ద‌రూ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ని తెలిసింది. ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా సాయి ప‌ల్ల‌వి, రానాకు జోడీగా ఐశ్వ‌ర్యారాజేష్ న‌టించ‌నున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే చిత్ర బృందం అధికారికంగా వీరి పేర్ల‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలిసింది. ఈ చిత్రానికి `బిల్లా – రంగ‌` అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్నార‌ట‌. ఫ్యామిలీ డ్రామాగా రూపొంద‌నున్న ఈ మూవీ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌డం ఖాయం అని చెబుతున్నారు. మ‌ల‌యాళ మాతృక‌కు భారీ మార్పులు చేసి ఈ రీమేక్‌ని రూపొందిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.