మాజీ నక్సలైట్ వద్ద ఫిదా బ్యూటీ


Sai Pallavi meet Naxalite ?
Sai Pallavi meet Naxalite ?

ఎప్పటికప్పుడు సరికొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గరవుతున్న బ్యూటీ సాయి పల్లవి. ఫిదా సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న ఈ తమిళ బ్యూటీ పాత్రలను ఎంచుకోవడంలో మహా గడసరి అని నిరూపించుకుంటోంది. పాత్ర ఎలాంటిదైనా అందులో లీనమయ్యే విదంగా నటించగల అమ్మడు ఇటీవల ఒక పాత్ర కోసం రియల్ మాజీ నక్సలైట్ దగ్గరకి వెళ్లినట్లు తెలుస్తోంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో వీరాటపర్వం అనే సినిమా చేస్తోంది. రానా ఈ సినిమాలో పోలీస్ అధికారిగా నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా రియాలిటీగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. 1990ల కాలంలో సాగే ఈ సినిమా కథలో సాయి పల్లవి నక్సలైట్ షేడ్స్ ఉన్న ఒక పాత్రలో కనిపించనుందట. అయితే ఆ సినిమాలో పాత్ర రియాలిటీగా ఉండాలని అమ్మడు ఒక రియల్ మాజీ నక్సలైట్ ను కలిసినట్లు తెలుస్తోంది. అతని అనుభవంతో అప్పట్లో నక్సలైట్స్ ఉండే వ్యవహార శైలి గురించి ఆమెకు వివరించారట.
అలాగే అడవుల్లో ప్రమాదాలను ఎదుర్కోన్నప్పుడు నక్సల్స్ ఎలా ఉంటారు? అలాగే పోలీసులు ఎటాక్ చేసినపుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అనే విషయాల గురించి సాయి పల్లవి తెలుసుకుంటోంది. అలాగే అడవుల్లో అన్నలు చేసే సాహసాలు వారి పాత్రల స్వభావాలపై అవగాహన కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటోందట. మొత్తానికి మునుపెన్నడు ఎవరు నటించని విదంగా ఫిదా బ్యూటీ హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.