బంప‌ర్‌ ఆఫ‌ర్‌ని సాయి ప‌ల్ల‌వి తిర‌స్క‌రించిందా?

Sai pallavi not intarested to act with pawankalyan?
Sai pallavi not intarested to act with pawankalyan?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్నతాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. బాలీవుడ్ హిట్ చిత్రం `పింక్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ ప్రారంభ‌మైంది. వ‌చ్చ నెల నుంచి ఈ మూవీ సెట్‌లో ప‌వ‌న్ సంద‌డి చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ప‌వ‌న్ మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లో న‌టించ‌డానికి రెడీ అయిపోతున్నవిష‌యం తెలిసిందే. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌‌క‌త్వం వ‌హించ‌నున్నారు. ఇందులో ప‌వ‌ర్‌స్టార్‌కు జోడీగా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి.

అయితే ఈ వార్త‌ల్లో ఎలాంటి నిజం లేద‌ని తెలిసింది. సినిమాలో త‌న క్యారెక్ట‌ర్‌కు అంత ప్రాధాన్య‌త లేద‌ని తెలియ‌డంతో సాయి ప‌ల్ల‌వి ఈ ఆఫ‌ర్‌ని సున్ని‌తంగా తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది. ప‌వ‌న్ ప‌క్క‌న ఆఫ‌ర్ అని తెలిసినా త‌న‌కు ఎలాంటి ప్రాధాన్య‌త లేక‌పోవ‌డం వ‌ల్లే సాయి ప‌ల్ల‌వి ఈ ఆఫ‌ర్‌ని తిరస్క‌రించిన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.