కోటిన్నర ఆఫర్ చేసినా సింపుల్ గా నో చెప్పిందట!


కోటిన్నర ఆఫర్ చేసినా సింపుల్ గా నో చెప్పిందట!
కోటిన్నర ఆఫర్ చేసినా సింపుల్ గా నో చెప్పిందట!

కొంత మంది టైమ్ ని బట్టి మారిపోతుంటారు. ఏ ఎండ కి ఆగొడుగు పట్టాలనుకుంటారు. కానీ కొంత మంది మాత్రం తాము అనుకున్న దానికే కట్టుబడి వుంటారు. ఎంతమంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. భారీగా అమౌంట్ వచ్చేస్తోంది కదా అని తన వద్దకు వచ్చిన ప్రతీ ఆఫర్నీ సొంతం చేసుకోరు సాయి పల్లవీ అంతే. ‘ఫిదా‘ సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకున్న సాయి పల్లవి తొలి చిత్రంతోనే అందరిని ఆకట్టుకుంది.

సాయి పల్లవి అద్భుతమైన నటేకాదు మంచి డాన్సర్ కూడా. రౌడీ బేబీ సాంగు లో తన స్టెప్పులతో ధనుష్ నే అల్లాడించింది. ఈ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ పాటలో సాయి పల్లవి స్టెప్పులు చూసి ఓ మూవీ భ్యాచ్ ఆమెకు కోటిన్నర ఇస్తామని, తమ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయాలని ఆఫర్ ఇచ్చారట. సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తున్న క్రేజీ నటికి ఐటమ్ సాంగ్ చేసే అవకాశం ఇస్తే చేస్తుందా చేయదు. సాయి పల్లవి అంతే  కోటిన్నర ఇస్తామన్నా సింపుల్ గా నో చెప్పిందట.
దీంతో సదరు మూవీ బ్యాచ్ మరో హీరోయిన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారట. మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా లో తమన్నా చేసిన ‘బ్యాంగ్ బ్యాంగ్ …’ పాట కోసం ముందు సాయి పల్లవిని దర్శకుడు అనిల్ రావిపూడి అడిగారట. అప్పుడు కూడా సాయి పల్లవి ఆ ఆఫర్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది.