సాయి ప‌ల్ల‌వి మ‌రో సినిమా రిజెక్ట్ చేసిందా?

సాయి ప‌ల్ల‌వి మ‌రో సినిమా రిజెక్ట్ చేసిందా?
సాయి ప‌ల్ల‌వి మ‌రో సినిమా రిజెక్ట్ చేసిందా?

సాయి ప‌ల్ల‌వి.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో టాలెంటెడ్ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది. సౌంద‌ర్య త‌ర‌హాలో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా వుంటూ న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకుంది. న‌చ్చిన చిత్రాల్లో మాత్ర‌మే న‌టిస్తూ సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది.

ఆమె టాలెంట్‌ని గుర్తించిన ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆమె వెంట‌ప‌డుతున్నారు. కానీ న‌చ్చిన చిత్రాల‌కు  మాత్ర‌మే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తోంది. స్టార్ హీరో సినిమా అయినా క్యారెక్ట‌ర్ విష‌యంలో కాంప్ర‌మైజ్ కావ‌డం తేదు. తాజాగా మ‌రో సినిమాని ఆమె రిజెక్ట్ చేసిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల చిరు, ప‌వ‌న్‌ల చిత్రాల‌ని సున్నితంగా తిర‌స్క‌రించిన సాయి ప‌ల్ల‌వి తాజాగా అనిల్ రావిపూడి ఆఫ‌ర్‌ని తిర‌స్క‌రించిన‌ట్టు తెలిసింది.

`ఎఫ్‌2`, `స‌రిలేరు నీకెవ్వ‌రు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాల త‌రువాత అనిల్ రావిపూడి `ఎఫ్2` చిత్రానికి సీక్వెల్‌గా `ఎఫ్‌3`ని సెట్స్ పైకి తీసుకురావాల‌నుకున్నారు. అయితే వెంక‌టేష్ `నార‌ప్ప‌` చిత్రంలోనూ.., వ‌రుణ్‌తేజ్ బాక్సింగ్ నేప‌థ్య చిత్రంలోనూ న‌టిస్తూ బిజీగా వున్నారు. వారితో `ఎఫ్‌3` ప‌ట్టాలెక్కించాలంటే మ‌రి కొన్ని నెల‌లు వేచి చూడాల్సిన ప‌రిస్థితి. దీంతో మ‌హిళా ప్ర‌ధాన చిత్రాన్ని చేయాల‌ని ప్లాన్ చే‌శార‌ట‌. ఈ చిత్రం కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దిస్తే ఆమె స‌న్నితంగా తిర‌స్క‌రించ‌డంతో అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు షాక్‌కు గురైన‌ట్టు చిత్ర వ‌ర్గాల స‌మాచారం.