కళ్యాణ్ రామ్ ని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

Sai Pallavi rejected Kalyan ram filmనందమూరి కళ్యాణ్ రామ్ సరసన సాయి పల్లవి నటించనని తేల్చి చెప్పిందట దాంతో షాక్ అయ్యారట ఆ చిత్ర బృందం . ఇంతకీ సాయి పల్లవి కళ్యాణ్ రామ్ సినిమాని ఎందుకు తిరస్కరించిందో తెలుసా ……. కళ్యాణ్ రామ్ సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదట ! దాంతో ఆ సినిమాలో నటించి ప్రయోజనం లేదు కాబట్టి నిర్మొహమాటంగా చెప్పిందట సాయి పల్లవి . ఇప్పుడు ఫిలిం నగర్ లో సాయి పల్లవి మ్యాటర్ సంచలనం సృష్టిస్తోంది కళ్యాణ్ రామ్ సినిమాని రిజెక్ట్ చేసిందని .

కళ్యాణ్ రామ్ హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు . విరించి వర్మ సాయి పల్లవి దగ్గరకు వెళ్లి కథ చెప్పాడట ! అయితే కథలో ఎక్కడా తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడంతో నో చెప్పిందట . సాయి పల్లవి అంత త్వరగా సినిమాలను ఒప్పుకోదు ఎందుకంటే తనకు బాగా నచ్చితేనే చేస్తుంది . పైగా ఆమెకు కొంత పొగరు ఎక్కువే ! అని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు . సాయి పల్లవి నో చెప్పడంతో మరో హీరోయిన్ ని వెదికే పనిలో పడ్డారు కళ్యాణ్ రామ్ , విరించి వర్మ .

English Title: Sai Pallavi rejected Kalyan ram film