శర్వానంద్ తో గొడవ పై స్పందించిన సాయి పల్లవి

sai pallavi responds on rumoursహీరో శర్వానంద్ తో హీరోయిన్ సాయి పల్లవి గొడవపడినట్లు వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తుండటంతో ఎట్టకేలకు స్పందించింది , నాకు శర్వానంద్ కు గొడవలు ఏమి జరగలేదని అయితే శర్వానంద్ ఈ సినిమాతో పాటుగా వేరే సినిమాలో నటిస్తున్నాడు కాబట్టి పడిపడి లేచె మనసు చిత్రానికి గ్యాప్ ఇచ్చారని అంతేకాని మామధ్య జరిగిన గొడవ కారణం కాదని అంటోంది సాయి పల్లవి . ఈభామ ఇంతకుముందు నాగశౌర్య సరసన నటించినప్పుడు ఆ హీరోని అవమానించిందని స్వయంగా నాగశౌర్య వెల్లడించాడు . కట్ చేస్తే నాకేమి తెలియదు అతడు అలా ఫీల్ అయి ఉంటాడు అని సర్దుబాటు ధోరణిలో చెప్పింది .

ఆ సినిమా తర్వాత నాని సరసన ఎం సి ఏ చిత్రంలో నటించగా అప్పుడు కూడా నాని తో గొడవపడినట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడేమో శర్వానంద్ తో గొడవ పడినట్లు వార్తలు వచ్చాయి . అయితే శర్వానంద్ తో మాత్రం నాకు గొడవలు లేవు అని ఓ చిన్న ముక్క చెప్పేసింది సాయి పల్లవి . ఈమె మాటలు ఎలా ఉన్నప్పటికీ ,కొంత యాటిట్యూడ్ మాత్రం చూపిస్తుంది అని పుకార్లు షికారు చేస్తున్నాయి సాయి పల్లవి మీద . ఒకరు ఇద్దరు అంటే అనుకోవచ్చు ఏకంగా ఇప్పుడు మూడో హీరో దాంతో సాయి పల్లవి వ్యవహారం నిజమే అని అనుకుంటున్నారు .

English Title: sai pallavi responds on rumours