సాయి ప‌ల్ల‌వి పాత్ర‌కు ఆమె స్ఫూర్తా?

సాయి ప‌ల్ల‌వి పాత్ర‌కు ఆమె స్ఫూర్తా?
సాయి ప‌ల్ల‌వి పాత్ర‌కు ఆమె స్ఫూర్తా?

రానా హీరోగా న‌టిస్తున్న సంచ‌ల‌న చిత్రం `విరాట‌ప‌ర్వం`.  వేణు ఊడుగుల దర్శ‌‌క‌త్వం వ‌హిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఉత్త‌ర తెలంగాణ జిల్లాల్లో 1990లో జ‌రిగిన య‌దార్ధ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

సాయి ప‌ల్ల‌వి పాత్ర ఈ చిత్రానికి ఆయువు ప‌ట్టు అని తెలుస్తోంది. జ‌న‌ప‌ద క‌ళాకారిణిగా, విప్ల‌వ గీతాలు ఆల‌పించే యువ‌తిగా ఆమె పాత్ర చాలా కొత్త‌గా వుంటుంద‌ని తెలుస్తోంది. అత్యంత స‌హ‌జ‌త్వంగా మేక‌ప్ లేకుండా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో ప‌క్కా తెలంగాణ ప‌ల్లె ప‌డుచుగా ఆమె పాత్ర సాగుతుంద‌ని, ఆమె పాత్ర‌కు 1990లో అత్యంత దారుణంగా హ‌త్య‌కు గురైన బెల్లి ల‌లిత పాత్ర స్ఫూర్తి అని తెలుస్తోంది.

బెల్లి ల‌లిత గ్రామాల్లో తిరుగుతూ విప్ల‌వ గీతాలు ఆల‌పించేవార‌ట‌. అదే త‌ర‌హాలో సాయి ప‌ల్ల‌వి పాత్ర కూడా వుంటుంద‌ని, సినిమా ఆమె పాత్ర చ‌నిపోతుంద‌ని, ఆ స‌న్నివేశాలు భావోద్వ‌గ‌భ‌రితంగా వుంటాయ‌ని వినిపిస్తోంది. నందితా దాస్‌. ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు.