సాయి పల్లవి ఏంటి ఇంత షాకిచ్చింది


Sai Pallavi
సాయి పల్లవి ఏంటి ఇంత షాకిచ్చింది

సాయి పల్లవిని న్యాచురల్ బ్యూటీ అంటారు చాలా మంది. అందం మాత్రమే కాకుండా టాలెంట్ విషయంలో ఆమె మరో లెవెల్ అని ఎలాంటి పాత్రనైనా ఒదిగిపోయి నటిస్తుందని విమర్శకులు సైతం కొనియాడుతుంటారు. దీనికి తగ్గట్లే సాయి పల్లవి కూడా తన పెర్ఫార్మన్స్ తో సినిమాను మరో లెవెల్ కు తీసుకెళుతుంటుంది. ఎంసీఏ, ఫిదా చిత్రాల్లో ఈమె నటనే ఇందుకు సరైన ఉదాహరణ. ప్రస్తుతం సాయి పల్లవి రానా సరసన విరాటపర్వం 1992, నాగ చైతన్య సరసన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేస్తోంది.

అయితే పైన చెప్పిన స్టేట్మెంట్ గురించి సాయి పల్లవి స్పందిస్తూ తాను ఏ పాత్రకైనా సరిపోతాను అనడం కరెక్ట్ కాదని, తనకి నప్పని పాత్రలు చాలా ఉన్నాయని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ఏ నటీనటులైనా తనకు అన్ని రకాల పాత్రలు చేయాలనుందని, తనను ఆల్రౌండర్ గా పరిగణించాలని కోరుకుంటారు. సాయి పల్లవి ఏమో ఈ రకంగా స్టేట్మెంట్. మరీ ఇంత నిజాయితీ ఉంటే కష్టమే సుమా.