సాయి ప‌ల్ల‌వి ప్ర‌యోగం చేయ‌బోతోందా?

 

Sai pallavi to pair kali venkat
Sai pallavi to pair kali venkat

సాయి పల్లవి దక్షిణాదిన ఎంత‌టి ప్రాచుర్యం పొందిందో అందిరికి తెలిసిందే. త‌న‌దైన న‌ట‌న‌తో క్యారెక్ట‌ర్‌ల‌ని పండించడంతో సాయి ప‌ల్ల‌వి శైలి ప్ర‌త్యేకం. న‌టిగా ద‌క్షిణాదిలో ఆమెకున్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. `ఫిదా` చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకుని స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది.

ప్ర‌స్తుతం రానాతో విరాట‌ప‌ర్వం, నాగ‌చైత‌న్య‌తో ల‌వ్‌స్టోరీ వంటి చిత్రాల్లో న‌టిస్తున్న సాయి ప‌ల్ల‌వి ప‌వ‌ర్‌స్టార్‌తో `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లోనూ న‌టించ‌బోతోంది. ఇదిలా వుంటే న‌టిగా మంచి డిమాండ్ వున్న సాయి ప‌ల్ల‌వి త్వ‌ర‌లో ఓ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కాళి వెంక‌ట్ హీరోగా త్వ‌ర‌లో త‌మిళంలో ఓ మూవీ రూపొంద‌బోతోంది.

ఇందులో అత‌నికి జోడీగా సాయి ప‌ల్ల‌వి న‌టించ‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. క్రేజీ హీరోయిన్‌గా భారీ స్టార్ డ‌మ్‌ని సొంతం చేసుకున్న సాయి ప‌ల్ల‌వి ఓ మూమూలు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ కు జోడీగా న‌టించ‌డం ఏంట‌ని అంతా విస్తూ పోతున్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌ల ద‌శ‌లో వున్న ఈ చిత్రానికి సాయి ప‌ల్లవి గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే  ఈ మూవీ ఓ ప్ర‌యోగంగా నిల‌వ‌నుంద‌ని అంటున్నారు.