సౌంద‌ర్య బ‌యోపిక్ చేయ‌బోతున్నారా?

సౌంద‌ర్య బ‌యోపిక్ చేయ‌బోతున్నారా?
సౌంద‌ర్య బ‌యోపిక్ చేయ‌బోతున్నారా?

వెండితెర‌పై బ‌యోపిక్‌ల సంద‌డి మొద‌లైంది. టాప్ సెల‌బ్రిటీల జీవిత క‌థ‌ల‌తో పాటు లెజెండ్‌ల విజ‌య గాధ‌ల్ని ప‌లు భాష‌ల్లో బ‌యోపిక్‌ల రూపంలో తెర‌పైకి తీసుకొస్తున్న విష‌యం తెలిసిందే. ఈ త‌ర‌హా చిత్రాల‌కు ప్రేక్ష‌కుల్లోనూ ప్ర‌త్యేక ఆస‌క్తి ఏర్ప‌డ‌టంతో ద‌ర్శ‌కనిర్మాత‌లు ఈ త‌ర‌హా చిత్రాలు చేయ‌డానికి ముందుకొస్తున్నారు.

ఇటీవ‌ల మ‌హాన‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా చేసిన `మ‌హాన‌టి` విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు జాతీయ స్థాయిలో అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఈ నేప‌థ్యంలో న‌టి సౌంద‌ర్య జీవిత క‌థ కూడా లెర‌పైకి కాబోతోంద‌ని తెలిసింది. 1990స్‌లో సౌంద‌ర్య సౌత్ ఇండ‌స్ట్రీని ఓ ఊపు ఊపేశారు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోయిన్‌గా త‌న స‌త్తాను చాటారు.

2004 ఏప్రిల్ 17న సౌంద‌ర్య బీజేపీ అభ్య‌ర్థి ప్ర‌చారం కోసం వెళుతూ ప్లేన్ క్రాష్ కావ‌డంతో ఆ ప్ర‌మాదంలో అత్యంత దారుణ ప్ర‌మాదానికి గురై మృతి చెందారు. త్వ‌ర‌లో సౌంద‌ర్య జీవిత క‌థ నేప‌థ్యంలో ఓ బ‌యోపిక్‌ని రూపొందించాల‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఇందు కోసం సౌంద‌ర్య పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించిన‌ట్టు తెలిసింది. సాయి ప‌ల్ల‌వి ప్ర‌స్తుతం విరాట‌ప‌ర్వం, ల‌వ్‌స్టోరీ చిత్రాల‌తో పాటు `వేదాలం` రీమేక్‌లోనూ న‌టించ‌నుంద‌ని తెలిసింది.