`విరాట‌ప‌ర్వం` సాంగ్ గ్లింప్స్ వ‌చ్చేసింది!

`విరాట‌ప‌ర్వం` సాంగ్ గ్లింప్స్ వ‌చ్చేసింది!
`విరాట‌ప‌ర్వం` సాంగ్ గ్లింప్స్ వ‌చ్చేసింది!

రానా ద‌గ్గుబాటి హీరోగా న‌టిస్తున్న చిత్రం `విరాట‌ప‌ర్వం`. హైలీ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్‌ సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌ల‌క్ష్మీ వెంటేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్‌పై అభిరుచి గ‌ల నిర్మాత‌ సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, టీజ‌ర్, సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసిన రానా, సాయి ప‌ల్ల‌విల పోస్ట‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల్ని క్రియేట్ చేసింది. ‌

షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఉత్త‌ర తెలంగాణ నేప‌థ్యంలో య‌దార్థ సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల తెర‌కెక్కిస్తున్నారు. డా. ర‌విశంక‌ర్ .. కామ్రేడ్ ర‌వ‌న్న‌గా ఎందుకు మారాడు?.. జ‌నం కోసం గ‌న్ను ఎందుకు ప‌ట్టాడు? అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థాంశంగా తెలుస్తోంది.

స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 30న విడుద‌ల కానున్న ఈ మూవీ కోసం చిత్ర బృందం అప్పుడే ప్ర‌మోష‌న్స్‌ని స్టార్ట్ చేసింది. ఈ నెల 25న ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియోని రిలీజ్ చేయ‌బోతోంది. సాయి ప‌ల్ల‌విపై చిత్రీక‌రించిన `కోలు కోల‌మ్మ కోలో నా సామీ..` అంటూ సాగే పాట‌కు సంబంధించి గ్లింప్స్‌ని మంగ‌ళ‌వారం సాయంత్రం చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట‌లో బావిలో నీళ్లు తోడుతూ చ‌లాకీగా చిందులు వేస్తున్న సాయి ప‌ల్ల‌వి లుక్ ఆక‌ట్టుకుంటోంది. ఫుల్ సాంగ్ వినాలంటే ఈ నెల మ‌రో రెండు రోజులు వేచి చూడాల్సిందే.