సాయిరాం శంక‌ర్ హీరోగా మరో `బంప‌ర్ ఆఫ‌ర్`‌!

సాయిరాం శంక‌ర్ హీరోగా మరో `బంప‌ర్ ఆఫ‌ర్`‌!
సాయిరాం శంక‌ర్ హీరోగా మరో `బంప‌ర్ ఆఫ‌ర్`‌!

పూరి జ‌గ‌న్నాథ్ సోద‌రుడు సాయిరాం శంక‌ర్ హీ‌రోగా దాదాపు 12 ఏళ్ల క్రితం వ‌చ్చిన చిత్రం `బంప‌ర్ ఆఫ‌ర్‌`.జ‌య ర‌వీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో బిందు మాధ‌వి హీరోయిన్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి వి‌జ‌యాన్ని సాధించ‌డ‌మే కాకుండా హీరోగా సాయిరాం శంక‌ర్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా `బంప‌ర్ ఆఫ‌ర్‌` సినిమా పేరుతో దానికి 2 త‌గిలించి మ‌రో కొత్త క‌థ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నారు.

రాయ‌ల సీమ నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ చిత్రానికి `బంప‌ర్ ఆఫ‌ర్‌`కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌య ర‌వీంద్ర‌నే దర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. సాయిరాం శంక‌ర్ హీరోగా న‌టించ‌నున్న ఈ  చిత్రాన్ని సురేష్ విజ‌య ప్రొడ‌క్ష‌న్స్, సినిమాస్ దుకాన్ బ్యాన‌ర్‌ల‌పై సురేష్ ఎల్ల‌మ‌రాజు, సాయిరాం శంక‌ర్ నిర్మించ‌నున్నారు. ఈ మూవీ ఉగాది సంద‌ర్భంగా ప్రారంభం కానుంది.

ఏప్రిల్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ మూవీలో న‌టించే హీరోయిన్‌తో పాటు న‌టీన‌టులు, మిగ‌తా సాంకేతిక నిపుణుల వివ‌రాల్ని మేక‌ర్స్ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఈ చిత్రానికి క‌థ‌: అశోక, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, సినిమాటోగ్ర‌ఫీ :  ప‌ప్పు, ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఆర్ట్ : వ‌ర్మ‌.