భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా.. ఏం చెప్పబోతున్నారు?భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా.. ఏం చెప్పబోతున్నారు?
భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా.. ఏం చెప్పబోతున్నారు?

`చిత్ర‌ల‌హ‌రి` చిత్రంతో మేగామేన‌ల్లుడు సాయితేజ్ మ‌ళ్లీ స‌క్సెస్ బాట ప‌ట్టారు. `ప్ర‌తీరోజు పండ‌గే` విజ‌యం త‌రువాత సాయితేజ్ ప్లాన్ మారింది. క‌థ‌ల ఎంపిక విధానంలో మార్పులు మొద‌లైంది. అందుకే కొత్త త‌ర‌హా చిత్రాల‌ని ఎంచుకుంటున్నారు. ప్ర‌స్తుతం సుబ్బు ద‌ర్శ‌‌క‌త్వంలో `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌`తో పాటు దేవా క‌ట్టా ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మూవీ భారీ బ‌డ్జెట్‌తో వుంటుంద‌ని తెలిసింది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డానికి ముందు ప‌వ‌న్‌క‌ల్యాణ్ చేతుల మీదుగా ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

క‌రోనా కార‌ణంగా రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా ప‌డింది. `సోలో బ్ర‌తుకే సోబెట‌ర్‌` చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకున్నా ఇది కూడా క‌రోనా కార‌ణంగానే ఆగిపోయింది. ఇదిలా వుంటే తాజాగా సాయితేజ్ కొత్త‌గా మ‌రో చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. గోపాల్ అనే యువ ద‌ర్శ‌కుడు చెప్పిన కాన్సెప్ట్‌, టైటిల్ సాయితేజ్‌కు ఎంత‌గానో న‌చ్చింద‌ట‌. వెంట‌నే అత‌నితో సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు తెలిసింది.

ఈ చిత్రాన్ని ఠాగూర్ మ‌ధు నిర్మించ‌నున్నార‌ట‌. ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసిన ఈ చిత్రాన్ని క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌రువాత దేవా క‌ట్టా సినిమాతో పాటు ఈ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించనున్నార‌ట‌.