రిపబ్లిక్  డబ్బింగ్ ను మొదలుపెట్టిన సాయి తేజ్

రిపబ్లిక్  డబ్బింగ్ ను మొదలుపెట్టిన సాయి తేజ్
రిపబ్లిక్  డబ్బింగ్ ను మొదలుపెట్టిన సాయి తేజ్

మెగా హీరో సాయి తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ సినిమాతో మన ముందుకు రానున్న విషయం తెల్సిందే. తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయడంతో సినిమా పనులు తిరిగి మొదలయ్యాయి. సాయి తేజ్ కూడా రిపబ్లిక్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేశాడు. కరోనా సెకండ్ వేవ్ కంటే ముందే రిపబ్లిక్ షూటింగ్ పూర్తయింది.

ఇక ఇప్పుడు పాజిటివ్ కేసులు తగ్గడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సాయి తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ కు డబ్బింగ్ చెబుతున్నాడు.  ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేస్తారన్న రూమర్స్ వినిపించాయి కానీ రిపబ్లిక్ టీమ్ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయబోమని, కచ్చితంగా ముందుగా థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పారు.

దేవా కట్టా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. రిపబ్లిక్ పూర్తిగా పొలిటికల్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. జీ స్టూడియోస్ సంస్థ రిపబ్లిక్ చిత్ర సర్వహక్కులు కొనుగోలు చేయడం విశేషం.