పొలిటికల్ మోడ్ లోకి వెళ్తోన్న సాయి తేజ్పొలిటికల్ మోడ్ లోకి వెళ్తోన్న సాయి తేజ్
పొలిటికల్ మోడ్ లోకి వెళ్తోన్న సాయి తేజ్

మెగా హీరో సాయి తేజ్ ఇప్పుడు మాంచి జోరు చూపిస్తున్నాడు. వరస ప్లాపుల తర్వాత రెండు హిట్స్ వచ్చేసరికి ఎక్కడలేని కాన్ఫిడెన్స్ సాయి తేజ్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా తన లాస్ట్ సినిమా ప్రతిరోజూ పండగే తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో మళ్ళీ తేజ్ సినిమాలకు గిరాకీ పెరిగింది. ప్రస్తుతం తేజ్ చేస్తోన్న సినిమాకు బిజినెస్ ఆఫర్లు ఇప్పటినుండే మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం తేజ్ కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించే సోలో బ్రతుకే సో బెటరు అనే సినిమాలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ చిత్రం తర్వాత తేజ్ నెక్స్ట్ సినిమా కూడా కన్ఫర్మ్ అయినట్లు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే. ప్లాపుల్లో ఉన్నా కూడా దేవ కట్టాకు టాలెంటెడ్ డైరెక్టర్ అన్న బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇటీవలే కాలంలో ఏ హిట్ లేని ఈ దర్శకుడు మెగా హీరోతో సినిమా చేసే అవకాశాన్ని మాత్రం సంపాదించాడు. ఈ సినిమాకు హీరోయిన్ కూడా ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. చిత్రలహరిలో తేజ్ సరసన నటించిన నివేతా పేతురాజ్ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైందట. అల వైకుంఠపురములో చిత్రంలో కూడా ఈ భామ ఒక కథానాయికగా నటించింది.

ఇంకా ఈ చిత్రం పొలిటికల్ టచ్ ఉన్న థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కనుందని సమాచారం. మే నుండి షూటింగ్ ను మొదలుపెట్టి ఈ ఏడాదే చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. పొలిటికల్ డ్రామాతో మాస్ మసాలా అంశాలకు కొదవ లేని ఈ సబ్జెక్ట్ ను ఎంతవరకూ ప్రేక్షకులకు చేరువగా తీసుకెళ్లగలడు దర్శకుడు అన్నది వేచి చూడాలి. వరసగా సాఫ్ట్ ఇమేజ్ ఉన్న పాత్రలను ఎంపిక చేసుకున్న తేజ్ మరోసారి రూట్ మార్చాడు. మరి ఆ నిర్ణయం సరైనదేనా?